కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ సత్య
సింగరాయకొండలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం.. మారిటైం బోర్డ్ ఛైర్మన్ దామచర్ల సత్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సింగరాయకొండ మండలం టీడీపీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. టీడీపీతో ఎన్టీఆర్ సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని కొనియాడారు.