శ్రీశైలం: మహానంది మండలం నంది పల్లె సమీపంలోని పంట పొలాల్లో కుళ్ళిన మృతదేహ కలకలం
మహానంది మండలం నందిపల్లె సమీపంలో ఉన్న పంట పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. నందిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ పంట పొలంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.