మణుగూరు: భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కొత్తగా డయాగ్నస్టిక్ ల్యాబ్ మరియు సిటీ స్కాన్!
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక డయాగ్నస్టిక్ ల్యాబ్, సిటీ స్కాన్ సదుపాయాలు రానున్నాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.