శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఘనంగా కార్తీక ఆకాశదీపోత్సవ కార్యక్రమం
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ఆకాశదీపోత్సవంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఆకాశదీపానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్, అర్చక స్వాములు, అధికారులు కలిసి ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని ఏర్పాటు చేశారు. కార్తీక మాసం నెలరోజుల పాటు అర్చక స్వాములు ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు.