వివిధ కారణాలతో పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లను జడ్చర్ల సీఐ కమలాకర్ బాధితులకు శుక్రవారం అందజేశారు.మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు జడ్చర్లకు చెందిన ఫోన్ బాధితులకు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయా కేసులను ఛేదించి పోగొట్టుకున్న మొబైల్స్ ను యజమానులకు అందజేశారు. ఈ మేరకు వారు సీఐ కి, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.