మహబూబ్ నగర్ అర్బన్: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం: పట్టణంలో స్మార్ట్ సమ్మిట్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణం లోని శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నిష్ణాతులైన వారు ఈరోజు ఒక రోజు సెమినార్ లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. 40 స్టార్టప్స్ వచ్చాయని, వారు చేసిన ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణీకరణ అభివృద్ధ