భిక్కనూర్: పెద్దమల్లారెడ్డి పాఠశాలలో విద్యార్థులకు కంటి వైద్య శిబిరం
భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పరీక్షల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు తేలిన విద్యార్థులు కళ్లద్దాలు వాడాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.