రాజోలు: రాజోలులో ఘనంగా నాగుల చవితి వేడుకలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, నాగదేవతకు పాలు, కోడిగుడ్లు, నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.