నాగర్ కర్నూల్: ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీలోకి మారేడు శివశంకర్, బిజ్జా శ్రీనివాసులు
కరీంనగర్లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల్లో నాగర్ కర్నూల్ జిల్లా నేతలు మారేడు శివశంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, బిజ్జా శ్రీనివాసులు రాష్ట్ర సమితి సభ్యునిగా ఎన్నికయ్యారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన కోసం పోరాటం చేస్తామని వారు తెలిపారు.