కూసుమంచి: ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న యువత గుండెపోటు మరణాలు: ఆందోళనలో స్థానికులు
ఉమ్మడి జిల్లాలో గత ఆరు నెలల్లో 30 ఏళ్ల లోపు 8 మంది యువకులు గుండెపోటుతో మరణించారు. ఆహారపు అలవాట్లు, ఫిట్నెస్ లేకపోవడం వల్లే యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. తాజాగా ఖమ్మం గ్రౌండ్లో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.