తంగళ్లపల్లి: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కాదు.. విలీన దినోత్సవం :CPM నేతలు
సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కాదు..విలీన దినోత్సవం అని CPM కార్యవర్గ సభ్యురాలు జువ్వాజి విమల అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లోని సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి స్థూపానికి సిపిఎం నాయకులు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం విమల మాట్లాడుతూ..కుల,మత భేదాలు లేక తెలంగాణ ప్రజలు పోరాటం చేశారని, BJP మతతత్వ ప్రచారం చేసుకుంటుందన్నారు.