దర్శి: జమ్మూ కశ్మీర్ లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దర్శి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన
Darsi, Prakasam | Apr 26, 2025 జమ్మూ కశ్మీర్ లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దర్శి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్లో ముగిసింది. కార్యక్రమంలో దర్శి పట్టణానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.