మల్యాల: జగిత్యాల-కరీంనగర్ రోడ్డుపై ప్రమాదం: కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల ఎక్స్‌రోడ్ వద్ద కారు ఢీకొనడంతో మద్దుట్లకు చెందిన చుంచుల మల్లయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.