కొండపి: సింగరాయకొండలోని ఈద్గామిట్ట షాదీ ఖానాలో కిశోరి వికాస్ కార్యక్రమం నిర్వహణ
సింగరాయకొండలోని ఈద్గామిట్ట షాదీ ఖానాలో కిశోరి వికాస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ రిజ్వాన మాట్లాడుతూ.. కోశోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ జయ కుమార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, వెట్టి చాకిరీ, బాలికల అక్రమ రవాణా మొదలైన వాటిని నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.