విశాఖపట్నం: మున్సిపల్ కార్మికుల నిరసన: 12వ పీఆర్సీ అమలు కోసం రాష్ట్రవ్యాప్త ధర్నాలు
వేతనాల పెంపు, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు డీఏ వర్తింపు కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు సెప్టెంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. గాజువాక జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్‌కు వినతి పత్రం అందించారు.