శ్రీశైలం: అభ్యర్థుల్లో.. టెన్షన్ టెన్షన్... క్రాస్ ఓటింగ్ భయం. రేపు తేలనున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు భవిత్యం
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అభ్యర్థుల్లో.. టెన్షన్ టెన్షన్... క్రాస్ ఓటింగ్ భయం నెలకొన్నట్లు విశ్వాసనీయ సమాచారం. గ్రామాల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, స్థానికత ఆధారంగా కొందరు, పార్టీలపరంగా మరికొందరు ఓటును ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. న్యూట్రల్ గా ఉన్న ఓటర్ల ఆధారంగా గ్రామాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో ఆయా పార్టీల పై, వ్యక్తులపై వ్యతిరేకత పై క్రాస్ ఓటింగ్ ప్రభావం నెలకొన్నట్లు తెలుస్తుంది.