అధ్వానంగా మారిన వెంకటగిరి గూడూరు రోడ్డు
రోజూ వేలాదిమంది రాకపోకలు సాగించే వెంకటగిరి-గూడూరు రోడ్డు ఇది. రూ.40 కోట్లతో పనులు ప్రారంభించారు. 8నెలల కిందట పనులు ఆపేశారు. బాలాయపల్లె-అమ్మపాలెం మధ్య రోడ్డు దారుణంగా ఉండటంతో రాకపోకలకు రెట్టింపు సమయం అవుతోంది. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని MLA కురుగొండ్ల ఎప్పుడో ప్రకటించారు. ఈలోగా భారీ వర్షాలు రావడంతో ఇలా మారింది. మా MLA ఎప్పుడు పనులు చేయిస్తాడో ఏమో అని రోజూ వేలాది మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు.