వేములవాడ రూరల్: ఫాజుల్ నగర్ రిజర్వాయర్ లోకి నీరు విడుదల.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ రిజర్వాయర్ లోకి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేశారు. నీరు వస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్లు గంగమ్మ తల్లికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా.. రైతుల పంట పొలాలు ఎండకూడదనే ఉద్దేశంతో రిజర్వాయర్లు చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.