విశాఖపట్నం: తీవ్ర వాయుగుండం అలర్ట్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26 నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, ప్రజల తరలింపు, వైద్య సదుపాయాలు మరియు ముందస్తు జాగ్రత్తలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.