కొండపి: సింగరాయకొండ లో అనుమానస్పద మృతి చెందిన విద్యార్థి మృతిపై వార్డెన్ విచారించాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు
సింగరాయకొండ మండల కేంద్రంలో ఈనెల 14వ తేదీన నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థి తౌశిక్ అనుమానస్పద మృతి చెందాడు. వార్డెన్ వేధించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతవరకు వార్డెన్ ని విచారించలేదని విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి మృతి పై మరింత లోతుగా విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.