కర్నూలు: పత్తికొండలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించిన విద్యార్థులు
బాలల దినోత్సవం సందర్భంగా పత్తికొండ రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు ప్రభుత్వ సేవలు, పథకాల అమలు తీరు గురించి వివరించారు.