మణుగూరు: భీమవరంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి.. ఇద్దరి అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమవరంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 1,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 8 లీటర్ల సారా, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు.