కొండపి: పొగాకు గిట్టుబాటు ధర లేదని కందుకూరు పొగాకు వేలం కేంద్రం వద్ద పొన్నలూరు పొగాకు రైతుల ఆందోళన
పొగాకు గిట్టుబాటు ధర లేదని కందుకూరు పొగాకు వేలం కేంద్రం వద్ద పొన్నలూరు మండలానికి చెందిన పొగాకు రైతులు గురువారం ఆందోళనకు దిగారు. కందుకూరు-కనిగిరి రోడ్డుపై బైఠాయించారు. వ్యాపారులంతా కుమ్మక్కై నాణ్యమైన పొగాకుకు సైతం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వాపోయారు. సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేరోజు రూ.250 నుంచి రూ.200కు ధర పడిపోవడంతో ఆందోళన చేశారు.