కొండపి: కొండపి పొగాకు కొనుగోలు కేంద్రంలో 885 పొగకు బేళ్లను కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణ అధికారి వెల్లడి
కొండపి స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసరి ధర కేజీ రూ 245.14పలికిందని వేలం నిర్వహణ అధికారి జి సునీల్ కుమార్ తెలిపారు.గుర్రప్పడియ,మూగచింతల,చతుకుపాడు,కె. అగ్రహారం,నెన్నూరుపాడు గ్రామాలకు చెందిన రైతులు వేలానికి 1227 బేళ్లను తీసుకొని వచ్చారు.అందులో 885 బేళ్లు కొనుగోలు అయ్యాయి.వ్యాపారులు వివిధ కారణాలతో 342 బేళ్లను తిరస్కరించారు.పొగాకు గరిష్ట ధర కేజీ రూ 280, కనిష్ట ధర కేజీ రు 210 గా నమోదయింది.వేలంలో 16 కంపెనీలు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.