కర్నూలు నగరంలోనూ గ్రామాల కంటే హీన పరిస్థితులు నెలకొన్నాయని ఈశ్వర్‌నగర్, పంచరత్నకాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల ఎదుట మురికి నీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద, అనారోగ్యాలు పెరిగాయని వారు మాట్లాడుతూ, ఎన్నేళ్లుగా అర్జీలు పెట్టుకున్నా కాలువలు–రోడ్లు నిర్మించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ ఇంటికి సమీపంలో ఉన్న కాలనీలైనా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవసరం లేని చోట రోడ్లు, కాలువలు వేస్తూ… నడవడానికి కూడా మార్గం లేని మా కాలనీలను విస్మరిస్తున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపాలిటీ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్