జూలూరుపాడు: జిల్లాలో 102, 108 వైద్య సేవలపై కీలక ఆదేశాలు: డెలివరీ కేసుల్లో అప్రమత్తత తప్పనిసరి!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 102, 104, 108 సేవలను వేగవంతం చేయాలని, డెలివరీ కేసులను సకాలంలో ఆసుపత్రులకు తరలించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన ఆదేశించారు.