మహబూబ్ నగర్ అర్బన్: నగరపాలికలో వార్డుల విభజన శాస్త్రీయంగా లేదు: బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ ఛైర్మన్ నర్సింహులు
మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచేయాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ నర్సింహులు డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. శాస్త్రీయంగా వార్డుల విభజన చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు కుటిల ప్రయత్నాలు ఎందుకని ప్రశ్నించారు