కోయిల్ కొండ: కోయిలకొండ మండలంలోని ఘనంగా శ్రీరామకొండ రాములోరి పల్లకీ సేవ
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కోయిలకొండ మండలంలోని శ్రీ రామ కొండ క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం స్థానిక లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి శ్రీరామకొండ గుట్టకు శ్రీ సీతారాముల పల్లకీ సేవా కార్యక్రమం చెక్కభజనలో కోలాటాలతో ఉత్సాహంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పల్లకీ సేవలో పాల్గొన్నారు. రాత్రికి రామకొండపై స్వామి ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది.