శ్రీశైలం: పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో తెచ్చి నీళ్లు పెడుతూ పంటను కాపాడుకుంటున్న రైతులు
మహానంది మండలం బొల్లవరం గ్రామంలో మరియు ఆత్మకూరు ప్రాంతాంలో సాగు చేసిన మొక్కజొన్న,ఉల్లి , ఇతర పంటలను రక్షించుకోవడం కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. ఓ రైతు ట్యాంకర్ ద్వారా సమీపాన ఉండే నీటిని తరలించి కాపాడుకుంటున్నాడు. బావులు ఎండిపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరి రైతుల బావుల వద్ద మోటారు పంపు సెట్లను సరిచేసుకొని చేతికి రానున్న పంటలను రక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేపడుతున్నారు.