కర్నూలు: ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.98 లక్షలతో అభివృద్ధి పనులు: ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.98 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ మరియు వాటర్ ఫిల్టర్ సౌకర్యాలను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. రోగులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.