రాప్తాడు: యర్రంపల్లి లో మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరికి నివాళులర్పించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం ఐదు గంటల పది నిమిషాల సమయంలో కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామంలో ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి మృతి దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ హనుమంతరావు చౌదరి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు టిడిపి అధ్యక్షుడిగా ఉంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉండటం జరిగిందని పార్టీ అభివృద్ధి కూడా ఎంతో కృషి చేయడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.