పాయకరావుపేట: నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.