శ్రీశైలం: స్థానిక సమరానికి సన్నద్ధం గా ఉండండి, కేడర్ కు దిశా నిర్దేశం చేసిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా
ఆత్మకూరు పట్టణంలోని వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల స్థాయిసమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలను ప్రశ్నిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించేలా కృషి చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి కార్యకర్తలను కోరారు.