మహబూబాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసిన TAUK ప్రతినిధి అబ్దుల్ ఖుద్దూస్
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) యువజన సమన్వయకర్త అబ్దుల్ ఖుద్దూస్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిశారు. యూకేలో నిర్వహిస్తున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల గురించి కలెక్టర్కు వివరించగా, ఆయన చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.