కట్టంగూర్: చెరువు అన్నారం గ్రామంలో రైతు సంఘం ఆలిండియా మహాసభల ప్రచారం
రైతు సంఘం ఆలిండియా మహాసభల ప్రచారంలో భాగంగా కట్టంగూర్ మండలం చెరువు అన్నారంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కరపత్రాలను పంపిణీ చేసిన నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు మల్లం మహేష్, గద్దపాటి సుధాకర్ తదితరులు హాజరయ్యారు.