దర్శి: మైనార్టీ కులాల వారికి రుణాలు మంజూరు చేసేందుకు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానం: తాళ్లూరు ఎంపీడీవో
Darsi, Prakasam | May 13, 2025 మైనార్టీ కులాల వారికి రుణాలు మంజూరు చేసేందుకు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తాళ్లూరు ఎంపీడీవో దారా హనుమంతరావు మంగళవారం తెలిపారు. మండలంలో 14 యూనిట్లకు రూ.10 లక్షల సబ్సిడీతోపాటు మరో రూ. 10 లక్షలు బ్యాంకు ద్వారా అందిస్తామని ఆయన చెప్పారు. అర్హులైన మైనార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.