చింతలపూడి: ఏలూరు జిల్లాలో వరద నీటిలో మునిగిన వీరేశ్వరస్వామి ఆలయం
ఏలూరు జిల్లా తాడువాయిలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం ఎర్రకాలువ వరదతో నీట మునిగింది. గర్భాలయంలోకి మూడు అడుగుల మేర నీరు చేరడంతో విగ్రహాలు సగానికి పైగా నీటిలోనే ఉన్నాయి. వరద నీటిలోనే అర్చకులు పూజలు నిర్వహిస్తుండగా, దర్శనం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.