ఉరవకొండ: అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించిన పి ఏ సీ సభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల లోని అంకంపల్లి ,దుద్దేకుంట, గంగవరం గ్రామ పొలాలలో అకాల వర్షాలకు ఈదురు గాలులకు దెబ్బతిన్న పంటలను శనివారం ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ PAC మెంబర్ వై విశ్వేశ్వర్ రెడ్డి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలకు బెలుగుప్ప మండల లోని పలు గ్రామాలలో మొక్కజొన్న మరియు అరటి రైతులకు అపార నష్టం వాటిల్లిందన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పంట నష్టపోతే దాదాపు 7500 కోట్లు ఇన్సూరెన్స్ రైతులకు కేటాయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంత నష్టం జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడలేదన్నారు