కార్తీక దీపాల వెలుగులో కాశీవిశ్వేశ్వర ఆలయం
వెంకటగిరి పట్టణంలోని కాశీపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర ఆలయంలో కార్తీకమాసం పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్తీక మాసం 2 వ సోమవారం సందర్భంగా ఉదయం విశ్వేశ్వరుడికి విశేష అభిషేకాలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్తికదీపాల వెలుగులో ఆలయం ప్రకాశిస్తుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు