రాజోలు: రాజోలు తాటిపాక సెంటర్లో వినాయక చవితి సందడి: కిటకిటలాడుతున్న దుకాణాలు
రాజోలు మండలం తాటిపాకలో వినాయక చవితి పండుగ సందడి నెలకొంది. పండుగ పూజా సామాగ్రి, మట్టి వినాయక ప్రతిమలు, పండ్లు మరియు పూల కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తాటిపాక ప్రధాన రహదారి ప్రాంతం రద్దీగా మారింది.