శ్రీశైలం: దుప్పిని వేటాడడం కోసం వెంటపడిన కుక్కలు రక్షించిన ముష్టపల్లె గ్రామస్తులు
ఆత్మకూరు మండలం ముష్టపల్లె గ్రామం లో శుక్రవారం సాయంత్రం ఒక చుక్కల దుప్పి అడవిని వదిలి పంట పొలాల్లోకి వచ్చింది. ఎక్కడ చుక్క నీరు దొరకకపోవడంతో అది గ్రామ సమీపానికి చేరుకోగానే వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కల బారినుండి తప్పించు కునే క్రమంలో గ్రామంలోని పాడుబడిన గిలక బావిలో పడింది. గ్రామస్తులు కుక్కలను తరిమేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.గ్రామస్తులంతా దాన్ని చుట్టు ముట్టి ఎలాంటి ప్రాణ హాని జరగకుండా కాపలాగా ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు చేరుకొని దానిని తాడు సహాయంతో పైకి లాగి, వారి వాహనంలో తీసుకొని మళ్లీ అడవిలో వదలడం జరిగింది.