మేడిపల్లి: మేడిపల్లిలో దసరా పండుగ వేళ వరుస దొంగతనాలు
దసరా పండుగ కోసం ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లే లక్ష్యంగా మేడిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. సాయినగర్ కాలనీ మరియు రాజలింగం కాలనీలలోని ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.