కూకట్పల్లి: KPHB: వ్యాపార అప్పుల గొడవలో ఇల్లు విడిచి వెళ్లిన మహిళ
KPHB పరిధిలో వ్యాపార అప్పుల వ్యవహారంతో భర్తతో గొడవపడి శ్యామల అనే మహిళ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మూడేళ్లుగా హాస్టల్ నడుపుతున్న శ్యామల, రూ.60 లక్షల అప్పులపై భర్తతో వాదించుకున్న అనంతరం కనిపించకుండా పోయారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.