చిల్పూర్: జనగామలో అక్రమ వరి విత్తనాల స్వాధీనం: 546 బస్తాలు సీజ్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం గార్లగడ్డ తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 7.41 లక్షల విలువైన 546 బస్తాల వరి విత్తనాలను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. రైతులు అధీకృత డీలర్ల వద్దే రశీదుతో విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.