కనిగిరి: రాయవరం వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన సిపిఎం పార్టీ నాయకులు
కనిగిరి: రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కేశవరావు డిమాండ్ చేశారు. ఆదివారం కనిగిరి మండలం చల్లగిరి గల గ్రామంలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన పిచ్చమ్మ, రుక్మిణి కుటుంబ సభ్యులను కేశవరావు సిపిఎం నాయకులతో కలిసి పరామర్శించారు. అదేవిధంగా కనిగిరి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన పద్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ... బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.