రఘునాథపాలెం: జిల్లాలో నిలిచిన ఎరువుల పంపిణీ: 'ఎఫ్ఎఫ్ఎసి' యాప్ సర్వర్ డౌన్
'ఎఫ్ఎఫ్ఎసి' ఎరువుల బుకింగ్ యాప్ సర్వర్ సమస్యతో జిల్లా వ్యాప్తంగా ఎరువుల పంపిణీ నిలిచిపోయింది. ఈ-పాస్ యంత్రాలు పనిచేయకపోవడంతో రైతులు రోజంతా వేచి చూశారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది త్వరలోనే పంపిణీని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.