కనిగిరి: ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలి: జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఆంజనేయులు
కనిగిరి: ఎండియు ఆపరేటర్లతో ఇంటింటికి మొబైల్ వాహనాల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీ విధానాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని, ఈ విధానాన్ని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. కనిగిరి సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు పడికాపులు కాయవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. త్వరలోనే ప్రస్తుతం అమలవుతున్న రేషన్ షాపుల విధానాన్ని రద్దుచేసి, రేషన్ సరుకులకు బదులు నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని, దీనిని అడ్డుకోవాలన్నారు.