కళ్యాణదుర్గం: కుందుర్పి మండల వ్యాప్తంగా వర్షం, ఎండ, వేడిమి నుంచి ఉపశమనం పొందిన జనాలు
కుందుర్పిలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురు గాలులు వీచాయి. గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే చాలా రోజులు తర్వాత వర్షం కురవడంతో జనాలు సంతోషం వ్యక్తం చేశారు. ఎండ, వేడి మీద నుంచి ఉపశమనం పొందారు. అయితే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.