నంద్యాల అర్బన్: నంద్యాలలో ప్రారంభమైన వినాయక చవితి సందడి
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
వినాయక చవితి పర్వదినం సందర్భంగా నంద్యాలలో పండుగ వాతావరణం నెలకొంది. పండుగ కోసం పట్టణ ప్రజలకు కావాల్సిన మామిడి, బిల్వ, అరటి ఆకులతో పాటు వివిధ రకాల ఆకులు, పూలు, పండ్లను విక్రయించే ప్రాంతంలో సందడి కనిపిస్తోంది. స్థానిక టెక్కే మార్కెట్ యార్డు వద్ద వ్యాపారుల కోసం అధికారులు స్థలాలను కేటాయించారు. పట్టణ ప్రజలు ఇక్కడికి చేరుకొని కొనుగోలు చేస్తున్నారు.