అనపర్తి: పెద్దాడలో ఎన్డీఏ ఎంపీటీసీ అభ్యర్థి ఘన విజయం: కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ సప్ప మంగాదేవి
పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఎన్డీఏ ఎంపీటీసీ అభ్యర్థి 605 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపులో సహకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహా నాయకులకు, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సర్పంచ్ సప్ప మంగాదేవి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.